హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో జింజర్ హోటల్
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:51 AM
టాటా గ్రూప్ హోటల్స్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) తన జింజర్ హోటల్స్ ను హైదరాబాద్ జినోమ్ వ్యాలీకి విస్తరిస్తోంది.
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ హోటల్స్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) తన జింజర్ హోటల్స్ ను హైదరాబాద్ జినోమ్ వ్యాలీకి విస్తరిస్తోంది. ఇందులో భాగంగా జినోమ్ వ్యాలీలో ‘జింజర్ జినోమ్ వ్యాలీ’ పేరుతో ఒక స్టార్ హోటల్ నిర్మిస్తోంది. మాడిసన్ గ్రూప్‌తో కలిసి ఐహెచ్‌సీఎల్ ఈ 75 గదుల హోటల్ నిర్మించనుంది. జినోమ్ వ్యాలీ ప్రాంత వ్యాపార, సామాజిక కార్యక్రమాల కు ఈ హోటల్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.