ICICI Prudential: ఐసీఐసీఐ ప్రు యాక్టివ్ మూమెంటమ్ ఫండ్
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:01 AM
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్.. యాక్టివ్ మూమెంటమ్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. మార్కెట్ ధర, ట్రెండ్స్. లాభాలు తదితర అంశాల ఆధారంగా...
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్.. యాక్టివ్ మూమెంటమ్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. మార్కెట్ ధర, ట్రెండ్స్. లాభాలు తదితర అంశాల ఆధారంగా పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించింది. నిఫ్టీ 500 టీఆర్‌ఐ ఈ ఫండ్‌కు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌గా ఉండనుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.5,000. ముగింపు తేదీ ఈ నెల 22.
బంధన్ మల్టీ ఫ్యాక్టర్ ఫండ్
బంధన్ మ్యూచువల్ ఫండ్.. బంధన్ మల్టీ ఫ్యాక్టర్ ఫండ్‌ను ప్రారంభించింది. 250 లార్జ్, మిడ్ క్యాప్ స్టాక్స్‌ల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. బీఎ్‌సఈ 200 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌గా ఉండనుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 24. కనీస పెట్టుబడి రూ.1,000.
ఇవీ చదవండి:
చైనా నిపుణులు భారత్‌ను వీడుతున్న వైనంపై కేంద్రం నజర్
బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి