Share News

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.13,502 కోట్లు

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:06 AM

ప్రైవేట్‌ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను బ్యాంక్‌ రూ.13,502 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర...

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.13,502 కోట్లు

ముంబై: ప్రైవేట్‌ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను బ్యాంక్‌ రూ.13,502 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోలిస్తే ఇది 15.7 శాతం ఎక్కువ. కాగా స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 18 శాతం వృద్ధి చెంది రూ.12,630 కోట్లకు చేరింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఒక్కో షేరుకు రూ.11 డివిడెండ్‌ను బ్యాంక్‌ బోర్డు సిఫారసు చేసింది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 20 , 2025 | 04:06 AM