హ్యుండయ్ క్రెటా ఈవీ
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:20 AM
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండయ్.. భారత మార్కెట్లోకి క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 17న ప్రారంభం కానున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో క్రెటా ఈవీని...
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండయ్.. భారత మార్కెట్లోకి క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 17న ప్రారంభం కానున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో క్రెటా ఈవీని అధికారికంగా విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటికే భారత్‌లో హ్యుండయ్ కోనా, ఐయోనిక్ 5 కార్లను విక్రయిస్తోంది. 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన క్రెటా ఈవీ ఒకసారి చార్జింగ్‌తో 473 కిలోమీటర్లు, 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన కారు 390 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని తెలిపింది. ఈ కారు ధర రూ.20 నుంచి రూ.30 లక్షల మధ్యన ఉండొచ్చని అంచనా.