ఉపాధి కల్పనలో హైదరాబాద్ యునికార్న్‌లు టాప్
ABN , Publish Date - Feb 12 , 2025 | 03:27 AM
ఉపాధి కల్పనలో హైదరాబాద్ యునికార్న్‌లు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పని చేస్తున్న యునికార్న్‌లు జనవరి నెలలో ఉద్యోగ నియామకాల్లో 25ు వృద్ధిని సాధించాయి. ఉపాధి కల్పనలో...
హైదరాబాద్: ఉపాధి కల్పనలో హైదరాబాద్ యునికార్న్‌లు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పని చేస్తున్న యునికార్న్‌లు జనవరి నెలలో ఉద్యోగ నియామకాల్లో 25ు వృద్ధిని సాధించాయి. ఉపాధి కల్పనలో 74% వృద్ధితో హైదరాబాద్ యునికార్న్‌లు అగ్రస్థానంలో ఉండగా 60ు వృద్ధితో చెన్నై రెండో స్థానంలో ఉంది. జనవరి నెలలో నియామకాల ధోరణిపై నౌకరి జాబ్‌స్పీక్ ఇండెక్స్ ఈ విషయాలు ధ్రువీకరించింది. అయితే ఐటీ రంగం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టయితే నియామకాల్లో -1ు తగ్గుదలతో ఫ్లాట్‌గా ఉంది. రంగాలవారీగా చూసినట్టయితే ఎఫ్‌ఎంసీజీ 16ు, బీమా 15ు, ఫార్మా 11ు వృద్ధిని నమోదు చేశాయి. ఫ్రెషర్ల నియామకం 3ు పెరిగి నిలకడగా ఉంది. రిటైల్ రంగం దీర్ఘకాలిక ప్రతికూల ధోరణి నుంచి బయటపడి నియామకాల్లో 1ు వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్ వంటి కీలక మార్కెట్లు ఇందుకు దోహదపడ్డాయి. ప్రధానంగా మిడ్ లెవెల్ ఉద్యోగ నియామకాలు జోరుగా సాగాయని ఆ నివేదిక తెలిపింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For Telangana News And Telugu News