HUL Predicts Slight Price Increase: కొన్ని ఉత్పత్తుల ధరలు పెరిగే చాన్స్ హెచ్‌యూఎల్
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:46 AM
జీఎస్‌టీ రేట్లు తగ్గినా కొన్ని వస్తువుల రేట్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) భావిస్తోంది. ముఖ్యంగా జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రభావం లేని...
న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్లు తగ్గినా కొన్ని వస్తువుల రేట్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) భావిస్తోంది. ముఖ్యంగా జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రభావం లేని ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని కంపెనీ సీఎ్‌ఫఓ రితేష్ తివారీ చెప్పారు. అయితే ఈ పెంపు స్వల్పస్థాయిలోనే ఉంటుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తమ అమ్మకాల వృద్ధి రేటులో పెద్దగా ఎదుగూ బొదుగూ లేదన్నారు. అయితే నవంబరు నుంచి అమ్మకాల వృద్ధి రేటు ఊపందుకునే అవకాశం ఉందన్నారు. కాగా సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో హెచ్‌యూఎల్ నికర లాభం 3.8 శాతం పెరిగి రూ.2,694 కోట్లుగా నమోదైంది. సమీక్షా కాలంలో మొత్తం రెవెన్యూ కూడా రూ.15,703 కోట్ల నుంచి రూ.16,034 కోట్లకు పెరిగింది. కాగా రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.19 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది.
ఇవీ చదవండి:
ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..
రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి