Share News

ఆర్‌బీఐ నుంచి భారీ డివిడెండ్‌!

ABN , Publish Date - Jan 24 , 2025 | 05:29 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో డివిడెండ్‌ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది రూ.1.5 లక్షల కోట్ల నుంచి..

ఆర్‌బీఐ నుంచి భారీ డివిడెండ్‌!

రూ.2 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో డివిడెండ్‌ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని క్వాంట్‌ఎకో రీసెర్చ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ అంచనా వేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) కూడా ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి రూ.2.01 లక్షల కోట్లు డివిడెండ్‌గా చెల్లించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి ఎంత మొత్తం డివిడెండ్‌గా చెల్లించాలనే విషయాన్ని మే నెలలో జరిగే ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సమావేశం నిర్ణయించనుంది.


పెట్టుబడులు, రూపాయి-డాలర్‌ మారకం రేటులో తేడా, కరెన్సీ నోట్లు ప్రింట్‌ చేసినందుకు వచ్చే ఫీజు ద్వారా ఆర్‌బీఐకి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. అందులో కొంత మొత్తాన్ని తన అవసరాలకు ఉంచుకుని, మిగతా మొత్తా న్ని కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా చెల్లిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు నీరసించి, పన్నుల వసూళ్ల వృద్ధి రేటు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

Updated Date - Jan 24 , 2025 | 05:29 AM