జీడీపీలో కుటుంబ రుణాల వాటా 42 శాతం
ABN , Publish Date - Jun 11 , 2025 | 03:26 AM
గత మూడేళ్లుగా మన దేశంలోనూ కుటుంబాల అప్పులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. 2021 జూన్ నాటికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 36.6 శాతంగా ఉన్న ఈ అప్పుల భారం ప్రస్తుతం...
అయినా ఆందోళన చెందాల్సిన పని లేదు
తాజా రెపో తగ్గింపుతో అప్పులపై చెల్లించే వడ్డీ భారం రూ.60,000
వరకు తగ్గుదల ఎస్‌బీఐ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: గత మూడేళ్లుగా మన దేశంలోనూ కుటుంబాల అప్పులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. 2021 జూన్ నాటికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 36.6 శాతంగా ఉన్న ఈ అప్పుల భారం ప్రస్తుతం 42 శాతానికి చేరింది. 2023 డిసెంబరు నాటికి ఉన్న 40.2 శాతంతో పోల్చినా ఇది 1.8 శాతం ఎక్కువ. అయితే ఇదేమీ పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం కాదని ఎస్‌బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. ఇతర వర్థమాన దేశాల కుటుంబాల అప్పులు ఇప్పటికే ఆయా దేశాల జీడీపీలో సగటున 49.1 శాతానికి చేరిన విషయాన్ని గుర్తు చేసింది. ఆ దేశాలతో పోలిస్తే మన దేశ కుటుంబాల అప్పుల భారం ఇప్పటికీ తక్కువేనని స్పష్టం చేసింది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రెపో రేటు తగ్గించడంతో ఒక్కో కుటుంబం అప్పులపై చెల్లించే వడ్డీల భారం రూ.50,000 నుంచి రూ.60,000 వరకు తగ్గుతుందని అంచనా వేసింది.
ఇతర ప్రధానాంశాలు
రుణ మొత్తాలు పెరగడం కాకుండా.. రుణాలు తీసుకునే కుటుంబాలు పెరగడం వల్లే రుణ భారం పెరుగుతోంది.
మూడింట రెండు వంతుల రుణాల చెల్లింపులకు ఢోకా లేదు
గృహ, వాహన వంటి ఆస్తుల రూపంలో 25 శాతం కుటుంబ రుణాలు
కుటుంబ రుణాల్లో వ్యవసాయం, వ్యాపారం, విద్యా రుణాలు వంటి ఉత్పాదక రుణాల వాటా మూడు శాతం
45 శాతం రుణాలు వినియోగ సంబంధమైన రుణాలు
రిటైల్, ఎంఎ్‌సఎంఈల రుణాల్లో 80 శాతం రెపో లేదా ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలు
మరో రెండేళ్ల వరకు వడ్డీ రేట్లు కిందికే
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..