నారాయణమూర్తికి గౌరవ డాక్టరేట్
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:15 AM
దేశంలో తొలి ఇంటర్నేషనల్ యూనివర్శిటీగా గుర్తింపుపొందిన సాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్‌పర్సన్, పద్మవిభూషణ్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తికి...
చెన్నై (ఆంధ్రజ్యోతి): దేశంలో తొలి ఇంటర్నేషనల్ యూనివర్శిటీగా గుర్తింపుపొందిన సాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్‌పర్సన్, పద్మవిభూషణ్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు, ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియం కూడా గౌరవ డాక్టరేట్‌లను స్వీకరించారు.