Share News

హోండా-నిస్సాన్‌ విలీన ప్రతిపాదన రద్దు

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:34 AM

టోక్యో: జపాన్‌కు చెందిన వాహన తయారీ సంస్థలు హోండా, నిస్సాన్‌, మిత్సుబిషి తమ వ్యాపారాల విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నాయి. విలీనం దిశగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలికినట్లు...

హోండా-నిస్సాన్‌ విలీన ప్రతిపాదన రద్దు

టోక్యో: జపాన్‌కు చెందిన వాహన తయారీ సంస్థలు హోండా, నిస్సాన్‌, మిత్సుబిషి తమ వ్యాపారాల విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నాయి. విలీనం దిశగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలికినట్లు గురువారం కంపెనీలు ప్రకటించాయి. తొలుత వ్యాపారాల ఏకీకరణ ద్వారా జాయింట్‌ హోల్డింగ్‌ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన నుంచి నిస్సాన్‌ను హోండా అనుబంధ విభాగంగా మార్చే దిశగా చర్చలు మొదలైనట్లు నిస్సాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మకోటో ఉచిడా తెలిపారు. ‘‘ప్రపంచ వాహన మార్కెట్లో పెరిగిన పోటీని తట్టుకునేందుకు మూ డు కంపెనీలు ఏకమవ్వాలని భావించాం. కానీ, ప్రస్తుత చర్చలు సాగుతున్న తీరు నిస్సాన్‌ సత్తాను పూర్తి స్థాయిలో రాబట్టలేదు. అందుకే నిస్సాన్‌ను అనుబంధ విభాగంగా మార్చే ప్రతిపాదనకు ఒప్పుకోలేదని’’ ఆయన పేర్కొన్నారు. ఇక వ్యాపార పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. అయితే, వ్యాపారాల ఏకీకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు షేర్ల మార్పిడిని తాము సూచించినట్లు విడిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోండా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ తొషిరో మిబే అన్నారు.


For Business News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:34 AM