HAL Tejas Fuselage: హెచ్‌ఏఎల్‌కు తేజస్ యుద్ధ విమాన ఫ్యూజ్‌లేజ్
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:10 AM
దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ ఏంకే 1ఏకి సంబంధించి రెండో సెంటర్ ఫ్యూజ్‌లేజ్ (ప్రధాన క్యాబిన్)ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు...
అందజేసిన వేమ్ టెక్నాలజీస్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ ఏంకే 1ఏకి సంబంధించి రెండో సెంటర్ ఫ్యూజ్‌లేజ్ (ప్రధాన క్యాబిన్)ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వేమ్ టెక్నాలజీస్ అందజేసింది. దేశీయ ఏరోస్పేస్ రంగంలో స్థానికంగా ఉన్న కంపెనీల ప్రాధాన్యం పెరుగుతుందనేందుకు ఇది సంకేతం. ఈ ఏడాది ఆరంభంలో హెచ్‌ఏఎల్‌కు ఎల్ అండ్ టీ.. కోయంబత్తూర్‌లోని తన ప్లాంట్ నుంచి ఏంకే 1ఏ కోసం వింగ్ అసెంబ్లీ్‌సను అందించింది. తాజాగా వేమ్ టెక్నాలజీస్ ఫ్యూజ్‌లేజ్‌ను అందించటం విశేషం. గడచిన మూడేళ్ల కాలంలో విమానాలకు సంబంధించి కీలక కాంపోనెంట్లు, కాంప్లెక్స్ సిస్టమ్స్ కోసం దేశీయ కంపెనీలకు హెచ్‌ఏఎల్ దాదాపు రూ.13,763 కోట్ల విలువైన కాంట్రాక్టులను అందించింది.
ఇవి కూడా చదవండి
వార్నీ.. చివరకు నకిలీ టికెట్లు కూడానా.. విషయం ఏంటంటే..
బ్యాంక్ ఉద్యోగిని కొంపముంచిన ఏఐ.. ఇంత మోసమా?..