Share News

హాస్పిటల్‌ సేవలపై జీ ఎస్ టీ వర్తిస్తుందా

ABN , Publish Date - Jun 29 , 2025 | 02:53 AM

మన దేశంలో ఆరోగ్య రంగం ఈ మధ్య కాలంలో బాగా విస్తరించింది. మన దగ్గర వైద్య సేవలు పొందేందుకు విదేశాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. మరి ఇంత ప్రాముఖ్యత కలిగిన హెల్త్‌కేర్‌...

హాస్పిటల్‌ సేవలపై జీ ఎస్ టీ వర్తిస్తుందా

మన దేశంలో ఆరోగ్య రంగం ఈ మధ్య కాలంలో బాగా విస్తరించింది. మన దగ్గర వైద్య సేవలు పొందేందుకు విదేశాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. మరి ఇంత ప్రాముఖ్యత కలిగిన హెల్త్‌కేర్‌ రంగానికి సంబంధించి జీఎ్‌సటీ ప్రభావం ఏమిటో తెలుసుకుందాం.

ఏ ప్రభుత్వమైనా ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలందించాలనే ప్రయత్నిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య సంరక్షణకు వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ)లో అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. దీన్ని బట్టి ఏదేనీ ఒక క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ అందించే అన్ని రకాల ఆరోగ్య సంరక్షణ సేవలకు జీఎ్‌సటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. మరి క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌, ఆరోగ్య సంరక్షణ సేవలు అంటే ఏమిటి?

క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ అంటే ఏదేనీ ఒక వైద్యశాల అంటే హాస్పిటల్‌, క్లినిక్‌, నర్సింగ్‌ హోమ్‌ లేదా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే లాబ్స్‌ మొదలైనవి. అలాగే హెల్త్‌కేర్‌ సర్వీస్‌ అంటే అన్ని రకాల వ్యాధులకు చేసే వైద్యం. అంటే ఏదేనీ ఒక హాస్పిటల్‌ రోగులకు అందించే మొత్తం వైద్యంతో పాటుగా ఒక మెడికల్‌ ప్రాక్టీషనర్‌, పారామెడికల్స్‌ అందించే వైద్య సేవలకు కూడా జీఎ్‌సటీ నుంచి మినహాయింపు ఉంది. అంతేకాకుండా, ఇన్‌పేషెంట్‌ ట్రీట్‌మెంట్‌కు కూడా మినహాయింపు ఉంది. అంటే, వైద్యం కోసం ఏదేనీ ఒక వ్యక్తి హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయినప్పుడు అతను చెల్లించే మొత్తం బిల్లు మీద అంటే చికిత్సతో పాటు రూమ్‌రెంట్‌, డాక్టర్‌ కన్సల్టింగ్‌ చార్జీలు, అతనికి సమకూర్చే భోజనం, మందులు మొదలైన వాటి మీద జీఎ్‌సటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవే కాకుండా అంబులెన్స్‌కు సంబంధించి ఏదైనా సర్వీస్‌ పొందినా దానికి కూడా జీఎ్‌సటీ వర్తించదు.


అయితే, రూమ్‌ రెంట్‌కు సంబంధించి 2022 జూలై నుంచి ఒక మార్పు చేయటం జరిగింది. దీని ప్రకారం రూమ్‌ అద్దె రోజుకు రూ.5,000 దాటే పక్షంలో దాని మీద 5 శాతం జీఎ్‌సటీని చెల్లించాల్సి ఉంటుంది. కానీ, దీనికి సంబంధించి ఇన్‌పుట్‌ ట్యాక్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకునే సౌలభ్యం సదరు హాస్పిటల్‌కు లేదు. ఇకపోతే, ఈ 5 శాతం జీఎ్‌సటీ అనేది సాధారణ రూమ్‌లకు మాత్రమే. అంటే ఐసీయూ లాంటి వాటికి అద్దె ఎంత ఉన్నా జీఎ్‌సటీ వర్తించదు.

అలాగే ఈ మధ్య కాలంలో సౌందర్యం ఇనుమడించటానికి కాస్మెటిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీ, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మొదలైన సేవలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటికి జీఎ్‌సటీ నుంచి మినహాయింపు లభించదు. కానీ ఏదేనీ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఇవి చేయాలంటే మాత్రం మినహాయింపు లభిస్తుంది. ఉదాహరణకు అందం కోసం ఒక వ్యక్తి ముక్కు లేదా ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటే మినహాయుంపు లభించదు. ఒకవేళ ఆ వ్యక్తి ఏదేనీ ప్రమాదానికి గురయి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాల్సి వస్తే మాత్రం జీఎ్‌సటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. పైన చెప్పినవన్నీ హాస్పిటల్‌ అందించే సేవలు. మరి హాస్పిటల్‌ పొందే సేవల మాటేమిటి? ఉదాహరణకు హౌస్‌ కీపింగ్‌, మెయింటెనెన్స్‌, సెక్యూరిటీ మొదలైన సేవలను బయటి వ్యక్తుల నుంచి పొందినప్పుడు వాటికి ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. అలాగే హాస్పిటల్‌లో నిర్వహించే మెడికల్‌ షాప్‌, క్యాంటీన్‌ అమ్మకాలకు కూడా జీఎ్‌సటీ నుంచి మినహాయింపు లేదు.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవీ చదవండి:

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు

ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 02:53 AM