October GST Revenue: జీఎస్‌టీ వసూళ్లు రూ 1.96 లక్షల కోట్లు
ABN , Publish Date - Nov 02 , 2025 | 02:39 AM
అక్టోబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.6 శాతం వృద్ధితో రూ.1.96 లక్షల కోట్లకు చేరింది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో...
అక్టోబరులో 4.6% వృద్ధి నమోదు
న్యూఢిల్లీ: అక్టోబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.6 శాతం వృద్ధితో రూ.1.96 లక్షల కోట్లకు చేరింది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో పండగ సీజన్‌లో కొనుగోళ్లు జోరందుకోవడం ఇందుకు దోహదపడింది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యల్ప వృద్ధి రేటు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సగటు వృద్ధి రేటు 9 శాతంగా ఉంది. సెప్టెంబరు 22 నుంచి 375 ఉత్పత్తులపై జీఎ్‌సటీ రేట్లు తగ్గడం గత నెల ఆదాయ వృద్ధిని పరిమితం చేసింది. ఈ ఆగస్టులో జీఎ్‌సటీ ఆదాయం 6.5 శాతం వృద్ధితో రూ.1.86 లక్షల కోట్లుగా, సెప్టెంబరులో 9.1 శాతం పెరుగుదలతో రూ.1.89 లక్షల కోట్లుగా నమోదైంది.
నికర ఆదాయం రూ.1.69 లక్షల కోట్లు
స్థానిక విక్రయాలకు సంకేతమైన దేశీయ స్థూల ఆదాయం గత నెలలో 2 శాతం పెరుగుదలతో రూ.1.45 లక్షల కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి పన్ను రాబడి 13 శాతం వృద్ధితో రూ.50,884 కోట్లకు పెరిగింది. గత నెలలో జీఎ్‌సటీ రిఫండ్లు 39.6 శాతం పెరిగి రూ.26,934 కోట్లకు చేరాయి. రిఫండ్లు మినహాయించగా, జీఎ్‌సటీ నికర ఆదాయం 0.2 శాతం పెరుగుదలతో రూ.1.69 లక్షల కోట్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో.. : గత నెల తెలంగాణలో జీఎ్‌సటీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి రూ.5,726 కోట్లకు చేరగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వసూళ్లు 9 శాతం తగ్గి రూ.3,490 కోట్లుగా నమోదయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News