GRT Jewellers: జీఆర్‌టీలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ మేళా
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:29 AM
‘జీఆర్‌టీ జువెలర్స్’ గోల్డ్ ఎక్స్ఛేంజ్ మేళాను ప్రకటించింది. వినియోగదారులు తమ పాత బంగారాన్ని తీసుకువచ్చి, మార్పిడి విలువపై గ్రాముకు రూ.150 అదనంగా పొందవచ్చని జీఆర్‌టీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు జీఆర్ ఆనంద్...
చెన్నై (ఆంధ్రజ్యోతి): ‘జీఆర్‌టీ జువెలర్స్’ గోల్డ్ ఎక్స్ఛేంజ్ మేళాను ప్రకటించింది. వినియోగదారులు తమ పాత బంగారాన్ని తీసుకువచ్చి, మార్పిడి విలువపై గ్రాముకు రూ.150 అదనంగా పొందవచ్చని జీఆర్‌టీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు జీఆర్ ఆనంద్ అనంత పద్మనాభన్, జీఆర్ రాధాకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. గోల్డ్ ఎక్స్ఛేంజ్ మేళా ద్వారా వినియోగదారులకు తమ పాత బంగారాన్ని వివాహాలు, వేడుకల కోసం రూపొందించిన అద్భుతమైన కొత్త డిజైన్లతో మార్పిడి చేసుకునే అపూర్వ అవకాశాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. వినియోగదారుల కోసం జీఆర్‌టీ ఎలెవెన్ ఫ్లెక్సీ ప్లాన్‌ను కూడా అందిస్తున్నామన్నారు. ఇది నెలవారీ ఆభరణాల కొనుగోలు ప్రణాళిక. 18 శాతం వరకు వేస్టేజీ చార్జీల మినహాయింపు లేదా విలువ ఆధారంగా అనువైన ఎంపికలతో, వినియోగదారులు బంగారం ధరల హెచ్చుతగ్గుల ప్రభావం లేకుండా స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్ని ఈ ప్రణాళిక అందిస్తుందని వివరించారు.
ఇవీ చదవండి:
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..