Granules India : గ్రాన్యూల్స్ లాభంలో 6 శాతం క్షీణత
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:33 AM
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్రాన్యూల్స్ ఇండియా నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 6 శాతం క్షీణించి రూ.117.60 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్రాన్యూల్స్ ఇండియా నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 6 శాతం క్షీణించి రూ.117.60 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.125.70 కోట్లుగా ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంతో పోల్చితే మాత్రం లాభం 21 శాతం వృద్ధి చెందింది. కాగా సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.1,156 కోట్ల నుంచి రూ.1,138 కోట్లకు తగ్గింది.