Share News

గ్రాన్యూల్స్‌ లాభం 17 శాతం వృద్ధి

ABN , Publish Date - May 29 , 2025 | 02:20 AM

గ్రాన్యూల్స్‌ ఇండియా నాలుగో త్రైమాసికానికి రూ.152 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.130 కోట్లతో...

గ్రాన్యూల్స్‌ లాభం 17 శాతం వృద్ధి

గ్రాన్యూల్స్‌ ఇండియా నాలుగో త్రైమాసికానికి రూ.152 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.130 కోట్లతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ. పార్ములేషన్స్‌ అమ్మకాలు 18 శాతం పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదం చేసిందని కంపెనీ సీఎండీ చిగురుపాటి కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.1,176 కోట్ల నుంచి రూ.1,197 కోట్లకు పెరిగింది. దీంతో ఒక్కో షేరుపై రూ.1.5 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. రూపాయి ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై ఇది 150 శాతానికి సమానం.


365% వృద్ధి సాధించిన సుజ్లాన్...

ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ సుజ్లాన్ ఎనర్జీ, మార్చి 31, 2025తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో (Q4 FY25) గణనీయమైన లాభాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 365% పెరిగి రూ.1,182 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా 73% వృద్ధి చెంది రూ.3,773 కోట్లకు చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ బలమైన పనితీరుతో, మొత్తం ఆర్థిక సంవత్సరానికి (FY25) కంపెనీ నికర లాభం రూ.2,072 కోట్లుగా నమోదైంది. సుజ్లాన్ సీఈఓ జేపీ చలసాని ప్రకారం, కంపెనీ 5.6 GW ఆర్డర్ బుక్‌తో భవిష్యత్ వృద్ధికి సిద్ధంగా ఉంది.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 09:33 PM