Granules India Deal : గ్రాన్యూల్స్‌ గూటికి స్విస్‌ కంపెనీ

ABN , First Publish Date - 2025-02-22T04:33:39+05:30 IST

స్విట్జర్లాండ్‌కు చెందిన సీడీఎంఓ (కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌) సేవల కంపెనీ ‘సెన్‌ కెమికల్స్‌ ఏజీ’ని 2 కోట్ల స్విస్‌..

 Granules India Deal : గ్రాన్యూల్స్‌ గూటికి స్విస్‌ కంపెనీ

  • ఒప్పందం విలువ రూ.192 కోట్లు

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన సీడీఎంఓ (కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌) సేవల కంపెనీ ‘సెన్‌ కెమికల్స్‌ ఏజీ’ని 2 కోట్ల స్విస్‌ ఫ్రాంక్‌లకు (సుమారు రూ.192 కోట్లు) కొనుగోలు చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ గ్రాన్యూల్స్‌ ఇండియా శుక్రవారం ప్రకటించింది. తద్వారా గ్రాన్యూల్స్‌ కూడా సీడీఎంఓ విభాగంలోకి ప్రవేశించినట్లైంది. సెన్‌ కెమికల్స్‌ తన గ్లోబల్‌ కస్టమర్ల కోసం పెప్టైడ్స్‌, పెప్టైడ్స్‌ ఆఽధారిత అప్లికేషన్లను అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రథమార్ధంలోనే డీల్‌ పూర్తి కావచ్చని గ్రాన్యూల్స్‌ వెల్లడించింది.

Updated Date - 2025-02-22T04:33:45+05:30 IST