Gold Rates on Nov 4: బలహీనపడ్డ డాలర్.. బంగారం ధరల్లో పెరుగుదల
ABN , Publish Date - Nov 04 , 2025 | 06:33 AM
ప్రాఫిట్ బుకింగ్‌తో ఇటీవల వరకూ తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మరి నేడు వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: లాభాల స్వీకరణ కారణంగా ఇటీవల కొద్ది రోజుల వరకూ దిద్దుబాటుకు లోనైన బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. డాలర్ బలహీనపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల కోత లేకపోవడంతో బంగారం, వెండికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయానికి దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,23,180కు చేరింది. 22 క్యారెట్ బంగారం ధర రూ.1,12,910గా ఉంది. కిలో వెండి కూడా రూ.100 మేర పెరిగి రూ.1,54,100కు చేరింది (Gold Rates on Nov 4).
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 3996 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 48 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఎమ్‌సీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ (10 గ్రాములు) ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగి రూ.1,21,987గా ఉంది. వెండి ఫ్యూచర్స్ కూడా రూ.1.48 లక్షల వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,23,830; ₹1,13,510; ₹94,760
ముంబై: ₹1,23,180; ₹1,12,910; ₹92,390
ఢిల్లీ: ₹1,23,330; ₹1,13,040; ₹92,520
కోల్‌కతా: ₹1,23,180; ₹1,12,910; ₹92,390
బెంగళూరు: ₹1,23,180; ₹1,12,910; ₹92,390
హైదరాబాద్: ₹1,23,180; ₹1,12,910; ₹92,390
విజయవాడ: ₹1,23,180; ₹1,12,910; ₹92,390
కేరళ: ₹1,23,180; ₹1,12,910; ₹92,390
పూణె: ₹1,23,180; ₹1,12,910; ₹92,390
వడోదరా: ₹1,23,230; ₹1,12,940; ₹92,420
అహ్మదాబాద్: ₹1,23,230; ₹1,12,940; ₹92,420
వెండి ధరలు ఇవీ (కిలో)
చెన్నై: ₹1,68,100
ముంబై: ₹1,54,100
ఢిల్లీ: ₹1,54,100
కోల్‌కతా: ₹1,54,100
బెంగళూరు: ₹1,54,100
హైదరాబాద్: ₹1,68,100
విజయవాడ: ₹1,68,100
కేరళ: ₹1,68,100
పూణె: ₹1,54,100
వడోదరా: ₹1,54,100
అహ్మదాబాద్: ₹1,54,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి