Gold Rates: రిలీఫ్..మళ్లీ తగ్గిన పసిడి ధరలు! ప్రస్తుత ధరలు ఇవీ
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:07 PM
నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు మళ్లీ రూ.700 మేర తగ్గాయి. ఈ నేపథ్యంలో వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగి రూ.1.23 లక్షల మార్కు దాటిన బంగారం ధర నేడు మళ్లీ దిగొచ్చింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.710 మేర తగ్గి రూ.1,22,460కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధరలో రూ.650 మేర కోత పడి రూ..1,12,250కు దిగింది. వెండి ధర ఏకంగా రూ.3 వేల మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.1,51,000గా ఉంది (Gold, Silver Rates on Nov 4)
హైదరాబాద్, విజయవాడల్లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా ఉంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,12,250గా ఉంది. రెండు నగరాల్లో వెండి రేట్ కిలోకు రూ.1,65,000 వద్ద కొనసాగుతోంది. మదపర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడం, ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై నానాటికీ సన్నగిల్లుతున్న ఆశలు, మళ్లీ పుంజుకున్న డాలర్ వెరసి బంగారం ధరలను తగ్గిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు(24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,22,730; ₹1,12,500; ₹93,900
ముంబై: ₹1,22,460; ₹1,12,250; ₹91,840
ఢిల్లీ: ₹1,22,510; ₹1,12,400; ₹91,990
కోల్‌కతా: ₹1,22,460; ₹1,12,250; ₹91,840
బెంగళూరు: ₹1,22,460; ₹1,12,250; ₹91,840
హైదరాబాద్: ₹1,22,460; ₹1,12,250; ₹91,840
విజయవాడ: ₹1,22,460; ₹1,12,250; ₹91,840
కేరళ: ₹1,22,460; ₹1,12,250; ₹91,840
పూణె: ₹1,22,460; ₹1,12,250; ₹91,840
వడోదరా: ₹1,22,510; ₹1,12,300; ₹91,890
అహ్మదాబాద్: ₹1,22,510; ₹1,12,300; ₹91,890
వెండి ధరలు ఇలా (కిలో)
చెన్నై: ₹1,65,000
ముంబై: ₹1,51,000
ఢిల్లీ: ₹1,51,000
కోల్‌కతా: ₹1,51,000
బెంగళూరు: ₹1,51,000
హైదరాబాద్: ₹1,65,000
విజయవాడ: ₹1,65,000
కేరళ: ₹1,65,000
పూణె: ₹1,51,000
వడోదరా: ₹1,51,000
అహ్మదాబాద్: ₹1,51,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి