Share News

Gold Rates Today: నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఇవీ

ABN , Publish Date - May 29 , 2025 | 07:21 AM

గత రెండు మూడు రోజులుగా బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. మరి నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Rates Today: నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఇవీ
Gold Rates on May 29, 2025

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో పసిడి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (Gold Rates on May, 29, 2025) 10 గ్రాముల 24 క్యారెట్‌ల మేలిమి బంగారం ధర సుమారు రూ.10 మేర తగ్గి 97,620కు చేరుకుంది. 22 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం కూడా స్వల్పంగా తగ్గి 89,490కు చేరుకుంది. ఇక 18 క్యారెట్‌ల బంగారం కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.73,220గా ఉంది. ఇక కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 మేర తగ్గి రూ 99,900కు చేరుకుంది.

వివిధ నగరాల్లోని బంగారం ధరలు (24కే, 22కే,18కే)

చెన్నై – ₹97,470; ₹89,340; ₹73,590

ముంబై – ₹97,470; ₹89,340; ₹73,100

దిల్లీ – ₹97,620; ₹89,490; ₹73,220

కోల్‌కతా – ₹97,470; ₹89,340; ₹73,100

బెంగళూరు – ₹97,470; ₹89,340; ₹73,100

హైదరాబాదు – ₹97,470; ₹89,340; ₹73,100

కేరళ – ₹97,470; ₹89,340; ₹73,100

పూణే – ₹97,470; ₹89,340; ₹73,100

వడోదర – ₹97,520; ₹89,390; ₹73,140

అహ్మదాబాద్ – ₹97,520; ₹89,390; ₹73,140


బంగారం ధరలు అధికంగా ఉండటంతో వినియోగదారుల అభిరుచి మారుతోందని కొందరు నగర వ్యాపారులు చెబుతున్నారు. నగల తయారీ కోసం సాధారణంగా వినియోగించే 22 క్యారెట్‌ల బంగారానికి బదులు వినియోగదారులు 18 క్యారెట్ల బంగారం వైపు మళ్లుతున్నట్టు చెబుతున్నారు. నగల అమ్మకాలు స్వల్పంగా పెరిగినా కూడా ఒక్కో వినియోగదారుడు కొనే సగటు బంగారం విలువ మాత్రం తగ్గిందని చెబుతున్నారు. మారుతున్న కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా తాము నగలు డిజైన్ చేస్తున్నట్టు కూడా కొందరు వ్యాపారులు తెలిపారు. బంగారం ధరల్లో తీవ్ర అస్థిరత నెలకొన్న నేపథ్యంలో అనేక మంది బంగారంపై పెట్టుబడులను వాయిదా వేసుకుంటున్నట్టు కూడా తెలిపారు.


గతేడాది బంగారం ధరలు సుమారు 45 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 25 శాతం మేర పెరుగుదల కనిపించింది. దీంతో, జనాలు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపట్లేదు. ఇక బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారన్న విషయం తెలిసిందే. 24 క్యారెట్ బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ బంగారంలో 91% బంగారం, మిగిలిన 9% రాగి, వెండి, జింక్ వంటి లోహాలు కలుస్తాయి. మోసాల బారిన పడకుండా ఉండేందుకు హాల్ మార్క్ ఉన్న బంగారు నగలను మాత్రమే కొనుగోలు చేయాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 02:57 PM