Share News

Gold Price Drop: పసిడి ర్యాలీకి బ్రేక్‌

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:42 AM

దేశీయ మార్కెట్లో పసిడి ర్యాలీకి బ్రేక్‌ పడినట్టు కనిపిస్తోంది. గత వారం ఒక దశలో ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ పసిడి ధర రూ.లక్ష మించిపోయింది. చివరికి వారాంతంలో అక్టోబరులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం ధర మల్టీ కమోడిటీస్‌ ఎక్స్ఛేంజీ...

Gold Price Drop: పసిడి ర్యాలీకి బ్రేక్‌

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో పసిడి ర్యాలీకి బ్రేక్‌ పడినట్టు కనిపిస్తోంది. గత వారం ఒక దశలో ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ పసిడి ధర రూ.లక్ష మించిపోయింది. చివరికి వారాంతంలో అక్టోబరులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం ధర మల్టీ కమోడిటీస్‌ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లో 2.74 శాతం నష్టపోయి రూ.98,764 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడిఽ ధర నేలచూపులు చూస్తోంది. ఔన్స్‌ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 1.12 శాతం నష్టపోయి 3,335.60 డాలర్ల వద్ద ముగిసింది. ఈ వారం ఇది మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. ‘జూలైలో పసిడి ధరలు బాగానే పెరిగాయి. అయితే సురక్షిత పెట్టుబడి అనే భావన సన్నగిల్లడం, అమెరికా-ఈయూ, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయనే అంచనాలతో ప్రస్తుతం పసిడి ధర దిద్దుబాటుకు లోనవుతోంది’ అని ఏంజిల్‌ వన్‌, డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌) ప్రథమేశ్‌ మాల్యా చెప్పారు. లాభాల స్వీకరణ అమ్మకాలు కూడా ఇందుకు తోడయ్యాయి. అమెరికా జీడీపీ గణాంకాలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ నిర్ణయం సహా చైనా కేంద్ర బ్యాంక్‌ కొనుగోళ్లు.. ఈ వారం దేశీయ మార్కెట్లో పసిడి ధరలను నిర్ణయించే వీలుంది.

ఇవీ చదవండి:

దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే

క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..

Read Latest and Business News

Updated Date - Jul 28 , 2025 | 01:42 AM