Gold ETFs Soar Amid Record: గోల్డ్ ఈటీఎఫ్‌లు జిగేల్
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:44 AM
బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకుతున్న నేపథ్యంలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్)లోకి భారీగా నిధులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) శుక్రవారం...
సెప్టెంబరు లో రూ.8,363 కోట్ల పెట్టుబడులు
రూ.90,000 కోట్లకు గోల్డ్ ఈటీఎ్‌ఫల ఏయూఎం
న్యూఢిల్లీ: బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకుతున్న నేపథ్యంలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్)లోకి భారీగా నిధులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరులో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎ్‌ఫల్లో కొత్తగా రూ.8,363 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వీటిలోకి వచ్చిన అత్యధిక నెలవారీ పెట్టుబడులివి. ఈ ఆగస్టులో నమోదైన రూ.2,190 కోట్లతో పోలిస్తే గత నెలలో దాదాపు నాలుగు రెట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో గోల్ట్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు విలువ రూ.90,000 కోట్ల మైలురాయిని దాటింది. వీటితో పాటు ఈక్విటీ, బాండ్లు, గోల్డ్ ఇలా భిన్న ఆస్తుల్లో పెట్టుబడులకు వీలుండే మల్టీ అసెట్ ఫండ్లలోకి గత నెలలో రికార్డు స్థాయిలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కాగా వరుసగా రెండో నెలా ఈక్విటీ ఫండ్లలోకి నిధుల ప్రవాహం తగ్గింది. గతనెలలో వీటిలోకి రూ.30,421 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టులో నమోదైన రూ.33,430 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 9 శాతం తగ్గాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..