Gold Rates on Oct 27: దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు!
ABN , Publish Date - Oct 27 , 2025 | 07:04 AM
బంగారం ధరల్లో గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరి నేడు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: గత వారం రికార్డు స్థాయిలను తాకిన మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.1.25 లక్ష మార్కు వద్ద తచ్చాడుతోంది. రోజు వారి ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే చోటుచేసుకుంటున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,25,610కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,15,140గా, 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.94,210గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.1,54,900గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,25,610గా, కిలో వెండి ధర రూ.1,69,900గా ఉంది (Gold Rates on 27, Oct, 2025).
ఈ వారం పసిడి, వెండి ధరలు పతనం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, చైనా మధ్య తగ్గుతున్న వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడే అవకాశం ఉంది. రేపు మొదలు కానున్న అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ సమావేశాల్లో వడ్డీ రేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం మార్కెట్‌లను అమితంగా ప్రభావితం చేయనుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడైంది.
బంగారం (24కే, 22కే, 18కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,25,440; ₹1,14,990; ₹96,240;
ముంబై: ₹1,25,610; ₹1,15,140; ₹94,210;
ఢిల్లీ: ₹1,25,760; ₹1,15,290; ₹94,360;
కోల్‌కతా: ₹1,25,610; ₹1,15,140; ₹94,210;
బెంగళూరు: ₹1,25,610; ₹1,15,140; ₹94,210;
హైదరాబాద్: ₹1,25,610; ₹1,15,140; ₹94,210;
కేరళ: ₹1,25,610; ₹1,15,140; ₹94,210;
పూణె: ₹1,25,610; ₹1,15,140; ₹94,210;
వడోదరా: ₹1,25,660; ₹1,15,140; ₹94,260;
అహ్మదాబాద్: ₹1,25,660; ₹1,15,140; ₹94,260;
వెండి ధరలు (కిలో)
చెన్నై: ₹1,69,900;
ముంబై: ₹1,54,900;
ఢిల్లీ: ₹1,54,900;
కోల్‌కతా: ₹1,54,900;
బెంగళూరు: ₹1,56,900;
హైదరాబాద్: ₹1,69,900;
కేరళ: ₹1,69,900;
పూణె: ₹1,54,900;
వడోదరా: ₹1,54,900;
అహ్మదాబాద్: ₹1,54,900;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
ఎస్‌బీఐలో మరో 3500 ఆఫీసర్ల కొలువులు
Nifty Faces Consolidation: టెక్ వ్యూ 26,000 వద్ద అప్రమత్తం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి