Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:23 AM
Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు బాగా తగ్గుతూ వచ్చాయి. గత నెలలో స్వచ్ఛమైన బంగారం లక్ష దగ్గర ట్రేడ్ అయింది. దిగువ, మధ్య తరగతి వాళ్లకు షాక్ ఇచ్చింది. అయితే, తర్వాతి నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 98 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇప్పటికి బంగారం ధరలు తగ్గినా.. భవిష్యత్తులో లక్ష దాటే అవకాశం కనిపిస్తోంది.
నేటి బంగారం ధరలు ఇలా..
భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,410 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,210 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,810 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా ..
మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, ఈ రోజు వెండి ధరలు కూడా అనుకోని షాక్ ఇచ్చాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 12,010 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,20,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
థాయ్‌లాండ్ ప్రధానిపై సస్పెన్షన్ వేటు
నివాసం ఉన్నచోటే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి