GMR Debt Repayment: త్వరలో రూ 6000 కోట్ల ఎన్‌సీడీల జారీ
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:05 AM
జీఎంఆర్ గ్రూప్ మరోసారి పెద్దఎత్తున నిధుల సమీకరణకు సిద్ధమవుతోంది. గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ రుణ పత్రాల జారీ ద్వారా...
న్యూఢిల్లీ: జీఎంఆర్ గ్రూప్ మరోసారి పెద్దఎత్తున నిధుల సమీకరణకు సిద్ధమవుతోంది. గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ రుణ పత్రాల జారీ ద్వారా త్వరలో రూ.4,000 కోట్ల నుంచి రూ.6,000 కోట్ల సమీకరించబోతున్నట్టు సమాచారం. ఈ నిధులను కంపెనీకి ఉన్న రూ.5,700 కోట్ల అధిక వడ్డీ రుణాలు చెల్లించేందుకు ఉపయోగిస్తారని భావిస్తున్నారు. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ) రూపంలో జారీ చేసే ఈ రుణ పత్రాలను సాధారణ ప్రజానీకం, సంస్థాగత మదుపరులకు కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌కు జారీ చేస్తారని సమాచారం.
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి