Share News

ప్రీమియర్‌ ఎనర్జీస్‌లో 5.55% వాటా విక్రయం

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:02 AM

హైదరాబాద్‌కు చెందిన సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ (పీవీ) సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీ్‌సలో 5.55 శాతం వాటాను జీఈఎఫ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ రూ.2,629 కోట్లకు విక్రయించింది....

ప్రీమియర్‌ ఎనర్జీస్‌లో 5.55% వాటా విక్రయం

హైదరాబాద్‌కు చెందిన సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ (పీవీ) సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీ్‌సలో 5.55 శాతం వాటాను జీఈఎఫ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ రూ.2,629 కోట్లకు విక్రయించింది. ఎన్‌ఎ్‌సఈ బల్క్‌ డీల్‌ డేటా ప్రకారం.. అమెరికాకు చెందిన జీఈఎఫ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ తన అనుబంధ విభాగమైన సౌత్‌ ఏషియా గ్రోత్‌ ఫండ్‌-2 హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ ద్వారా ప్రీమియర్‌ ఎనర్జీస్‌లో 5.5 శాతం వాటాకు సమానమైన 2.5 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ సగటున రూ.1,051.60కి విక్రయించింది. ఈ లావాదేవీ అనంతరం ప్రీమియర్‌ ఎనర్జీ్‌సలో సౌత్‌ ఏషియా గ్రోత్‌ వాటా 11.10 శాతం నుంచి 5.55 శాతానికి తగ్గింది. మంగళవారం ఎన్‌ఎ్‌సఈలో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ షేరు ధర 1.94 శాతం పెరిగి రూ.1,082.80 వద్ద ముగిసింది.

ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 03:05 AM