అదానీ వేతనం రూ 10 41 కోట్లు
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:54 AM
దేశంలో రెండో సంపన్నుడుగా పేరొందిన గౌతమ్ అదానీ ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.10.41 కోట్లు వేతనం తీసుకున్నారు. తన సొంత వ్యాపార విభాగాల...
పోటీదారుల కన్నా తక్కువే
న్యూఢిల్లీ: దేశంలో రెండో సంపన్నుడుగా పేరొందిన గౌతమ్ అదానీ ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.10.41 కోట్లు వేతనం తీసుకున్నారు. తన సొంత వ్యాపార విభాగాల కీలక ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర పారిశ్రామిక దిగ్గజాలు పొందిన వేతనం కన్నా అదానీ తీసుకున్న వేతనం తక్కువే. తమ వ్యాపార సామ్రాజ్యంలోని 9 లిస్టెడ్ కపెనీల్లో 2 కంపెనీల నుంచి ఆయన వేతనం పొందినట్టు ఇటీవల అదానీ గ్రూప్ విడుదల చేసిన వార్షిక నివేదికలో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన రూ.9.26 కోట్లతో పోలిస్తే గత ఏడాది వేతనం 12ు అధికం. దేశంలో కుటుంబ యాజమాన్యంలోని వ్యాపార సంస్థల అధిపతుల కన్నా కూడా అదానీ వేతనం తక్కువగా ఉంది. దేశంలో కొవిడ్-19 విజృంభణ తర్వాత అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ తన వేతనం మొత్తం వదులుకున్నారు. అంతకు ముందు ఆయన వేతనం రూ.15 కోట్లుండేది.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..