Share News

ఈ వారం నాలుగు ఐపీఓలు

ABN , Publish Date - May 26 , 2025 | 05:36 AM

ఐపీఓ మార్కెట్‌ మళ్లీ పుంజుకుంటోంది. ఈ వారం రూ.6,600 కోట్లు సమీకరించేందుకు నాలు గు కంపెనీలు ఐపీఓలు జారీ చేస్తున్నాయి. ఇందులో...

ఈ వారం నాలుగు ఐపీఓలు

రూ.6,600 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్‌ మళ్లీ పుంజుకుంటోంది. ఈ వారం రూ.6,600 కోట్లు సమీకరించేందుకు నాలు గు కంపెనీలు ఐపీఓలు జారీ చేస్తున్నాయి. ఇందులో లీలా ప్యాలెస్‌ హోటల్స్‌, ఏజీస్‌ ఒపాక్‌ టెర్మినల్స్‌, ప్రొస్టార్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, స్కోడా ట్యూబ్స్‌ ఉన్నాయి. ఇవి గాక గత వారం ఐపీఓలు జారీ చేసిన బొరానా వేవ్స్‌, బెల్‌రైస్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీల షేర్లు ఈ నెల 28, 29 తేదీల్లో లిస్టు కాబోతున్నాయి. మొత్తంమీద గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఐపీఓ మార్కెట్‌ జోరు తగ్గిందనే చెప్పాలి.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:36 AM