Share News

Flipkart Loans: ఇక ఫ్లిప్‌కార్ట్‌ రుణాలు..

ABN , Publish Date - Jun 06 , 2025 | 06:01 AM

వాల్ట్‌మార్ట్‌ నిర్వహణలోని దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఇక రుణాలు కూడా మంజూరు చేయనుంది. ఇందుకోసం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్సును...

Flipkart Loans: ఇక ఫ్లిప్‌కార్ట్‌ రుణాలు..
Flipkart Loans

ఎన్‌బీఎ్‌ఫసీ లైసెన్స్‌ మంజూరు

ముంబై: వాల్ట్‌మార్ట్‌ నిర్వహణలోని దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఇక రుణాలు కూడా మంజూరు చేయనుంది. ఇందుకోసం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్సును అందుకుంది. దీం తో ఫ్లిప్‌కార్ట్‌ ఇక నేరుగా ఖాతాదారులు, తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా వస్తువులు విక్రయించే సంస్థలకు రుణాలు మంజూరు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీల బాగస్వామ్యంతో ఈ రుణాలు అందజేస్తోంది. దేశంలో ఒక ఈ-కామర్స్‌ సంస్థకు ఆర్‌బీఐ ఎన్‌బీఎ్‌ఫసీ లైసెన్సు జారీ చేయడం ఇదే మొదటిసారి. డిపాజిట్లు సేకరించకుండా ఖాతాదారులు, అమ్మకందారులకు రుణాలు మాత్రమే మంజూరు చేయాలని ఆర్‌బీఐ తన లైసెన్సు పత్రంలో స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఈ ఎన్‌బీఎ్‌ఫసీ వచ్చే కొద్ది నెలల్లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ లైసెన్సు కోసం ఫ్లిప్‌కార్ట్‌ 2022లోనే ఆర్‌బీఐకి దరఖాస్తు చేసింది.

అదేబాటలో అమెజాన్‌: అమెజాన్‌.ఇన్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌ బాటలోనే పయనిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘యాక్సియో’ అనే ఎన్‌బీఎ్‌ఫసీను కొ నుగోలు చేసింది. అయితే ఆర్‌బీఐ నుంచి ఇందుకు ఇంకా అనుమతి లభించాల్సి ఉంది. మిగతా ఈ-కామర్స్‌ సంస్థలు కూడా ఇదే బా ట పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 06 , 2025 | 08:49 AM