Share News

హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌ విస్తరణ

ABN , Publish Date - Jan 22 , 2025 | 03:13 AM

దేశీయ ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. నగరంలోని హైటెక్‌ సిటీలో 5,000 మంది..

హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌ విస్తరణ

5,000 సీట్ల సామర్థ్యంతో కొత్త సెంటర్‌ ప్రారంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. నగరంలోని హైటెక్‌ సిటీలో 5,000 మంది పనిచేయగలిగే సామర్థ్యంతో, 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన కొత్త సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా హైటెక్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఆర్థిక సేవలు సహా పలు రంగాలకు చెందిన అంతర్జాతీయ క్లయింట్లకు కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌, డిజిటల్‌ పరివర్తన పరిష్కారాలను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ 2007 నుంచి హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. కొత్త సెంటర్‌తో కలిపి నగరంలోని కంపెనీ కార్యాలయాలు ఐదుకు చేరుకోగా.. సీటింగ్‌ సామర్థ్యం 8,500కు పెరిగింది.


భాగ్యనగరిలో మెల్ట్‌వాటర్‌ ఏఐ హబ్‌

అంతర్జాతీయ మీడియా, సోషల్‌ అండ్‌ కన్స్యూమర్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ మెల్ట్‌వాటర్‌.. హైటెక్‌ సిటీలో ఎమర్జింగ్‌ ఏఐ హబ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో కంపెనీకిది నాలుగో కార్యాలయం కానుంది. ఏఐలో రెండు దశాబ్దాల అనుభవం కలిగిన ఈ కంపెనీ.. రోజుకు 150 కోట్ల డిజిటల్‌ కంటెంట్‌ను విశ్లేషించి, ప్రపంచవ్యాప్తంగా తనకున్న 27,000 మంది కస్టమర్ల వ్యాపార వృద్ధికి అవసరమైన సమాచారంగా మలుస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Updated Date - Jan 22 , 2025 | 03:14 AM