ఎక్స్‌పోలో ఈవీలదే హవా
ABN , Publish Date - Jan 19 , 2025 | 01:56 AM
దేశ రాజధాని ఢిల్లీలో ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ పేరుతో ప్రారంభమై వాహనాల ప్రదర్శన పండగ సందడిగా సాగుతోంది. ఈ ఎక్స్‌పోలో రెండో రోజూ ఎలక్ట్రిక్ వాహనాలే ప్రధానంగా సందర్శకుల దృష్టిని ఆకర్షించాయి...
దేశ రాజధాని ఢిల్లీలో ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ పేరుతో ప్రారంభమై వాహనాల ప్రదర్శన పండగ సందడిగా సాగుతోంది. ఈ ఎక్స్‌పోలో రెండో రోజూ ఎలక్ట్రిక్ వాహనాలే ప్రధానంగా సందర్శకుల దృష్టిని ఆకర్షించాయి.
ఎక్స్‌పో తొలిరోజున క్రెటా ఈవీని ఆవిష్కరించిన దక్షిణ కొరియా కంపెనీ హ్యుండయ్.. శనివారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌తో పాటు మైక్రో ఫోర్ వీలర్‌లో ఆధునిక కాన్సెప్ట్ మోడళ్లను పరిష్కరించింది.
ప్యాసింజర్ వెహికిల్స్ సెగ్మెంట్లో వియత్నాంకు చెందిన విన్‌ఫా్‌స్ట, చైనాకు చెందిన బీవైడీ తమ కొత్త వాహనాలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించాయి. విన్‌ఫా్‌స్ట తన లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలైన వీఎఫ్ 7, వీఎఫ్ 6ను ప్రదర్శించింది. ఈ రెండు మోడళ్లను ఈ ఏడాదిలోనే భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. బీవైడీ సైతం తన ఈఎస్‌యూవీ ‘సీలియన్ 7’ను పరిచయం చేసింది.
జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ దేశంలో తొలి డీ ప్లస్ సెగ్మెంట్ ఎస్‌యూవీ మజెస్టర్‌ను ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ దేశీయంగా తయారు చేసిన సరికొత్త ఎక్స్3 మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.75.8 లక్షలుగా ఉంది.
ఎలక్ట్రిక్ బస్‌ల తయారీదారైన ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్ ఈ ఎక్స్‌పోలో 12 మీటర్ల బ్లేడ్ బస్ ప్లాట్‌ఫామ్‌పై రీడిజైన్ చేసిన బ్లేడ్ బ్యాటరీ చాసి్‌సతో పాటు 9 మీటర్ల సిటీ, 12 మీటర్ల కోచ్ బస్సులను ప్రదర్శించింది.