Share News

హైదరాబాద్‌లో ఎలీ లిల్లీ జీసీసీ

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:53 AM

హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్టు ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ ప్రకటించింది. డిజిటల్‌ వ్యూహాన్ని పటిష్ఠం చేసుకుని మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు...

హైదరాబాద్‌లో ఎలీ లిల్లీ  జీసీసీ

1,000కి పైగా నియామకాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్టు ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ ప్రకటించింది. డిజిటల్‌ వ్యూహాన్ని పటిష్ఠం చేసుకుని మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా 1,000కి పైగా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. లిల్లీ క్యాపబిలిటీ సెంటర్‌ ఇండియాగా (ఎల్‌సీసీఐ) వ్యవహరించే ఈ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా తమ అవసరాలకు అనుగుణంగా ఆటోమేషన్‌, కృత్రిమ మేధ, సాఫ్ట్‌వేర్‌ ప్రోడక్ట్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో తమ సామర్థ్యాలు విస్తరించేందుకు కృషి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది మధ్య కాలానికి ఈ జీసీసీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. కాగా నియామకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ బెంగళూరులో ఒక ఎల్‌సీసీఐ నిర్వహిస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలు చూపే ఆధునిక టెక్నాలజీలు, సాధనాలు తయారు చేయగల వివిధ రంగాలకు చెందిన ఇంజనీర్లను ఎల్‌సీసీఐ హైదరాబాద్‌ సమీకరిస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డియోగో రౌ చెప్పారు.


ఆరోగ్య సంరక్షణ రంగంలో పెరుగుతున్న హైదరాబాద్‌ ప్రాబల్యానికి ఈ పెట్టుబడి నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ర్టానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 03:53 AM