Share News

60-hour work : 60 గంటలకు మించిన పని కష్టమే

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:26 AM

వారానికి 60 గంటలకు మించిన పని విధానం ప్రతిపాదనపైనా ఆర్థిక సర్వే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విధానాన్ని అనుమతిస్తే అది ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

60-hour work  : 60 గంటలకు మించిన పని కష్టమే

వారానికి 60 గంటలకు మించిన పని విధానం ప్రతిపాదనపైనా ఆర్థిక సర్వే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విధానాన్ని అనుమతిస్తే అది ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దానివల్ల వారి మానసిక ఆరోగ్యం కూడా చెడిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. వారానికి 60 గంటలకు మించి పని చేస్తే, ఉద్యోగుల ఉత్పాదకత పెరిగినా, వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటాయని గతంలో జరిగిన సర్వేల్లో తేలిన విషయాన్ని గుర్తు చేసింది. మానసిక కుంగుబాటు, ఆదుర్దాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజూ 1,200 కోట్ల పని గంటలు, ఏటా సుమారు రూ.86.5 లక్షల కోట్లు ఉత్పత్తి నష్టపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక సర్వేను ఆర్థిక సర్వే గుర్తు చేసింది.


గ్రామీణ ఉపాధి హామీ పథకం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స) కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి 10వ తేదీ నాటికి 220.11 కోట్ల వ్యక్తిగత పనిదినాల కల్పన జరిగిందని సర్వే నివేదిక తెలిపింది. ఈ కార్యక్రమం కింద 99.98 శాతం చెల్లింపులు నేషనల్‌ ఎలక్ర్టానిక్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా జరుగుతున్నట్టు పేర్కొంటూ క్రియాశీలంగా పని చేస్తున్న వారిలో 96.3 శాతం మందికి చెల్లింపులు ఈ వ్యవస్థ ద్వారానే జరిగినట్టు తెలియచేశారు.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 01 , 2025 | 04:31 AM