Stock Market : మూడు రోజుల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:22 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్లలో అమ్మకాల కారణంగా ప్రామాణిక సూచీలు శుక్రవారం నష్టాల్లో
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్లలో అమ్మకాల కారణంగా ప్రామాణిక సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, గరిష్ఠ స్థాయి ముడిచమురు ధరలు సైతం ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ ఒకదశలో 780 పాయింట్ల మేర పతనమైనప్పటికీ, మళ్లీ కాస్త కోలుకుంది. చివరికి సూచీ 423.49 పాయింట్ల నష్టంతో 76,619.33 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108.60 పాయింట్లు కోల్పోయి 23,203.20 వద్ద క్లోజైంది.