Divis Laboratories: దివీస్ లాభం రూ. 689 కోట్లు
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:07 AM
దివీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.689 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...
దివీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.689 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.510 కోట్లు)తో పోల్చితే లాభం 35 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.2,338 కోట్ల నుంచి రూ.2,715 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ.1,722 కోట్ల నుంచి రూ.1,948 కోట్లకు పెరిగినట్లు దివీస్ పేర్కొంది. కాగా సెప్టెంబరు త్రైమాసికంలో ఫారెక్స్ లాభాలు రూ.29 కోట్ల నుంచి రూ.63 కోట్లకు పెరిగినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు
Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం