దివీస్ లేబొరేటరీస్ లాభం రూ.589 కోట్లు
ABN , Publish Date - Feb 04 , 2025 | 06:20 AM
దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2,401 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.589 కోట్ల నికర లాభాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2,401 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.589 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.358 కోట్లు)తో పోల్చితే లాభం 65 శాతం వృద్ధి చెందింది. కాగా ఈ ఏడాది జనవరి 1 నుంచి కాకినాడ ప్రాజెక్ట్‌లోని యూనిట్ 3 వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిందని తెలిపింది. ప్రాజెక్ట్‌లోని మిగిలిన యూనిట్లు వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు దివీస్ లేబొరేటరీస్ పేర్కొంది.