Digital NBFCs Personal Loans: డిజిటల్ వ్యక్తిగత రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సిలు హవా
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:15 AM
వ్యక్తిగత రుణ మార్కెట్లో డిజిటల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సి).. బ్యాంకులకు సవాల్ విసురుతున్నాయి. దరఖాస్తు చేసిన...
వ్యక్తిగత రుణ మార్కెట్లో డిజిటల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సి).. బ్యాంకులకు సవాల్ విసురుతున్నాయి. దరఖాస్తు చేసిన నిమిషాల్లోనే రుణాలు మంజూరు చేస్తూ తడాఖా చూపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి దేశంలో డిజిటల్ ఎన్‌బీఎ్‌ఫసీలు మంజూరు చేసిన వ్యక్తిగత రుణాలు రూ.1.28 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో రూ.97,381 కోట్ల రుణాలను ఈ సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబరు మధ్య మంజూరు చేసినట్టు ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ (ఫేస్) పేర్కొంది. చిరు వ్యాపారులు, అల్పాదాయ వర్గాలు వ్యక్తిగత రుణాల కోసం ఎక్కువగా డిజిటల్ ఎన్‌బీఎ్‌ఫసీలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 6.4 కోట్ల మంది ఈ సంస్థల నుంచి రూ.97,381 కోట్ల వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డిజిటల్ రుణాలు తీసుకున్న వారి సంఖ్య 50 లక్షలు పెరిగింది.
ఇవి కూడా చదవండ
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
కెప్టెన్‌గా జేమ్స్ అండర్సన్.. 43 ఏళ్ల వయసులో!