Share News

2025లో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ రూ.4.29 లక్షల కోట్లు

ABN , Publish Date - Jan 04 , 2025 | 06:08 AM

ప్రీమియం డివై్‌సలకు డిమాండ్‌ పెరగడంతో దేశంలో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 5,000 కోట్ల డాలర్లకు (రూ.4,28,900 కోట్లు) చేరుతుందని అంచనా. 2021 సంవత్సరంలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ పరిమాణం 3790

2025లో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ రూ.4.29 లక్షల కోట్లు

కౌంటర్‌ పాయింట్‌ అంచనా

న్యూఢిల్లీ: ప్రీమియం డివై్‌సలకు డిమాండ్‌ పెరగడంతో దేశంలో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 5,000 కోట్ల డాలర్లకు (రూ.4,28,900 కోట్లు) చేరుతుందని అంచనా. 2021 సంవత్సరంలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ పరిమాణం 3790 కోట్ల డాలర్ల (రూ.3.25 లక్షల కోట్లు) స్థాయిలో ఉంది. ప్రధానంగా యాపిల్‌, సామ్‌సంగ్‌ ప్రీమియం, అల్ర్టా ప్రీమియం ఫోన్ల మార్కెట్‌కు చోదకంగా ఉన్నాయని టెక్నాలజీ మార్కెట్‌ పరిశోధన సంస్థ కౌంటర్‌ పాయింట్‌ తాజా నివేదికలో తెలిపింది. మొబైల్‌ ఫోన్ల విభాగం ద్వారా 2024 సంవత్సరంలో యాపిల్‌ రూ.67,121.6 కోట్లు, సామ్‌సంగ్‌ రూ.71,1,57.6 కోట్ల ఆదాయం నమోదు చేశాయి. దేశంలో స్మార్ట్‌ఫోన్ల రిటైల్‌ సగటు విక్రయ ధర 300 డాలర్ల (రూ.25,700) దాటుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. యాపిల్‌ స్మార్ట్‌ఫోన్లను స్థానికంగా తయారుచేయడం, ఐఫోన్ల ధరలు ఇటీవల తగ్గింపు వల్ల ఆ కంపెనీకి చెందిన ప్రో మోడళ్లకు బలమైన డిమాండ్‌ కనిపిస్తోంది. అలాగే సామ్‌సంగ్‌ ఎస్‌ సీరీస్‌ ఫోన్ల ద్వారా విలువ ఆధారిత వ్యూహం అనుసరిస్తోంది. నివేదిక ముఖ్యాంశాలు...

చైనాకు చెందిన వివో, ఒప్పో, వన్‌ప్ల్‌స బ్రాండ్లు రూ.30,000-రూ.45,000 ధరల శ్రేణిలో అత్యాధునిక కెమెరా ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

వన్‌ప్ల్‌స తన స్మార్ట్‌ఫోన్లలో ఎదురైన మదర్‌బోర్డ్‌ సమస్యను, రిటైలర్ల ఫిర్యాదులను కూడా పరిష్కరించి పూర్వ వైభవం సాధించేందుకు కృషి చేస్తోంది. దీనికి తోడు ఈ కంపెనీ స్థానిక మార్కెట్లో విస్తరణపై రూ.6,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది.

ఈ ఏడాది ప్రీమియం విభాగం (రూ.30,000 ధర పైన) 20 శాతం పైబడిన మార్కెట్‌ వాటా సాధిస్తుందని అంచనా.

Updated Date - Jan 04 , 2025 | 06:08 AM