Covasent Launches: జీసీసీల కోసం ఎనేబ్లర్ సొల్యూషన్
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:48 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కోవాసంట్ టెక్నాలజీస్.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) కోసం ఎనేబ్లర్ పేరుతో ప్రత్యేక టెక్నాలజీని విడుదల చేసింది...
కోవాసంట్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కోవాసంట్ టెక్నాలజీస్.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) కోసం ఎనేబ్లర్ పేరుతో ప్రత్యేక టెక్నాలజీని విడుదల చేసింది. ఈ ఏఐ ఆధారిత టెక్నాలజీ సొల్యూషన్ జీసీసీల వ్యూహాత్మక విలువ లోటును పూడ్చడంలో ఎంతో సహాయకారిగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘నేటి జీసీసీలు ఆఫ్‌షోర్ సపోర్ట్ సిస్టమ్స్ స్థాయి నుంచి నవకల్పనలు, ప్రొడక్ట్ డెవల్‌పమెంట్, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రాలుగా ఎదిగాయి. దీంతో జీసీసీల ప్రాథమిక నిర్వచనం కూడా మారిపోయింది. మా ఎనేబ్లర్ ఈ సవాళ్లను అధిగమించడంలో జీసీసీలకు సహాయపడుతుంది’ అని ఎనేబ్లర్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.
ఇవీ చదవండి:
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి