Share News

కాగ్నిజెంట్‌లో 25,000 మంది ఫ్రెషర్ల హైరింగ్‌

ABN , Publish Date - May 02 , 2025 | 03:11 AM

ఈ ఏడాది ప్రాంగణ నియామకాల ద్వారా 20,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోనున్నట్లు అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ తెలిపింది...

కాగ్నిజెంట్‌లో 25,000 మంది ఫ్రెషర్ల హైరింగ్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రాంగణ నియామకాల ద్వారా 20,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోనున్నట్లు అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ఫ్రెషర్లకు ఉద్యోగాలివ్వనున్నట్లు కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ ఎస్‌ వెల్లడించారు. బలమైన మానవ వనరుల వ్యవస్థ నిర్మాణంతో పాటు గడిచిన రెండేళ్లలో పెరిగిన మేనేజ్డ్‌ సర్వీసెస్‌ ప్రాజెక్టులు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్రాజెక్ట్‌ డెవల్‌పమెంట్‌కు మద్దతుగా ఫ్రెషర్ల నియామకాలను పెంచాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఫ్రెషర్ల నియామకాలతో పాటు ఏఐ ద్వారా ఉత్పాదకత పెంపు, మానవ వనరులను మరింత మెరుగ్గా వినియోగించుకోవడంపై దృష్టి సారించిందన్నారు. ఈ మార్చి 31 నాటికి కాగ్నిజెంట్‌లో మొత్తం 3,36,300 మంది ఉద్యోగులున్నారు. అందులో 85 శాతానికి పైగా కంపెనీకి చెందిన భారత కార్యాలయాల్లో పనిచేస్తున్నారు.


త్రైమాసిక ఆదాయం 510 కోట్ల డాలర్లు: మార్చితో ముగిసిన త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7.45 శాతం పెరిగి 510 కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది మొత్తానికి ఆదాయ వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 2.6-5.1 శాతం నుంచి 3.9-6.4 శాతానికి పెంచింది. 2025లో మొత్తం 2050-2,100 కోట్ల డాలర్ల రాబడి నమోదు కావచ్చని సంస్థ అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి

Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..

Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు

Updated Date - May 01 , 2025 | 09:49 PM

Updated Date - May 02 , 2025 | 03:11 AM