Share News

Cipla Partners with Eli Lilly to Launch Tirzepatide: ఎలీ లిల్లీతో సిప్లా జట్టు

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:09 AM

టైప్‌-2 మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే ఔషధం టిర్జెపటైడ్‌ను ‘యుర్పీక్‌’ బ్రాండ్‌నేమ్‌తో భారత్‌లో విక్రయించేందుకు అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీతో దేశీయ ఔషధ సంస్థ సిప్లా ఒప్పం దం...

Cipla Partners with Eli Lilly to Launch Tirzepatide: ఎలీ లిల్లీతో సిప్లా జట్టు

న్యూఢిల్లీ: టైప్‌-2 మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే ఔషధం టిర్జెపటైడ్‌ను ‘యుర్పీక్‌’ బ్రాండ్‌నేమ్‌తో భారత్‌లో విక్రయించేందుకు అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీతో దేశీయ ఔషధ సంస్థ సిప్లా ఒప్పం దం కుదుర్చుకుంది. ఎలీ లిల్లీ టిర్జెపటైడ్‌ ఔషధాన్ని మౌంజారో పేరుతో ఈ ఏడాది మార్చిలోనే భారత్‌లో ప్రవేశపెట్టింది. అయితే, దేశంలో ఈ ఔషధ లభ్యతను నగరాల పరిధి దాటి విస్తరించేందుకు మరో బ్రాండ్‌నేమ్‌ (యుర్పీక్‌)తోనూ విక్రయించేందుకు ఎలి లిల్లీ, సిప్లా జట్టు కట్టాయి. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా ఎలీ లిల్లీ యుర్పీక్‌ను తయారు చేసి సిప్లాకు సరఫరా చేస్తుంది. సిప్లా ఈ ఔషధాన్ని మార్కెట్లో విక్రయిస్తుంది. దీన్ని కూడా మౌంజారో ధరకే విక్రయించనున్నట్లు ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి. భారత్‌లో ఇది రెండో టిర్జెపటైడ్‌ బ్రాండ్‌.

ఇవీ చదవండి:

ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..

రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 24 , 2025 | 06:09 AM