Share News

ఆస్తమా స్ర్కీనింగ్‌ కోసం సిప్లా మొబైల్‌ యాప్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:07 AM

ఫార్మా దిగ్గజం సిప్లా ఉబ్బసం (ఆస్తమా) రోగుల స్ర్కీనింగ్‌ కోసం ఒక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. సిప్‌ఎయిర్‌ పేరిట తయారుచేసిన ఈ మొబైల్‌ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఫోన్లపై అందుబాటులో...

ఆస్తమా స్ర్కీనింగ్‌ కోసం సిప్లా మొబైల్‌ యాప్‌

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా ఉబ్బసం (ఆస్తమా) రోగుల స్ర్కీనింగ్‌ కోసం ఒక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. సిప్‌ఎయిర్‌ పేరిట తయారుచేసిన ఈ మొబైల్‌ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఫోన్లపై అందుబాటులో ఉండగా త్వరలోనే ఐఓఎస్‌ డివై్‌సలకు కూడా అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది. దేశంలో ఉబ్బసం రోగుల సంఖ్య 3.43 కోట్లున్నట్టు అంచనా అని గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ నివేదిక తెలియచేసింది. ఉబ్బసం కారణంగా మరణించిన వారు, ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్న వారి సంఖ్య ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలో మూడు రెట్లు అధికంగా ఉంది. ఉబ్బసం వ్యాధిని సరిగ్గా గుర్తించలేకపోవడం, గుర్తించిన కేసుల్లో సరైన చికిత్స చేయకపోవడం ఇందుకు కారణమని చెబుతున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 06:07 AM