Share News

ఇక చెన్నై పెట్రోలియం పెట్రోల్‌ పంపులు

ABN , Publish Date - Jun 04 , 2025 | 06:04 AM

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీపీసీఎల్‌) రిటైల్‌ ఇంధన విక్రయ విభాగంలోకి అడుగుపెడుతోంది. వ్యాపార విస్తరణలో భాగంగా...

ఇక చెన్నై పెట్రోలియం పెట్రోల్‌ పంపులు

రూ.400 కోట్ల పెట్టుబడి

తొలుత తమిళనాడులో ఏర్పాటు

చెన్నై: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీపీసీఎల్‌) రిటైల్‌ ఇంధన విక్రయ విభాగంలోకి అడుగుపెడుతోంది. వ్యాపార విస్తరణలో భాగంగా.. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల కోసం సొంతం గా రిటైల్‌ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌ శంకర్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం వచ్చే రెండు మూడేళ్లలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. సంస్థ డైమండ్‌ జూబ్లీ సందర్భంగా ఈ ఏడాదే తొలి పెట్రోల్‌ పంపును ప్రారంభించాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. పెట్రోల్‌ పంపుల ఏర్పాటుకు సీపీసీఎల్‌ ఇప్పటికే కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందింది. తొలుత ఈ పంపులను తమిళనాడులో ప్రారంభించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 06:04 AM