Certus Capital Investment: హైదరాబాద్ రియల్టీలోకి సెర్టస్ క్యాపిటల్
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:24 AM
హైదరాబాద్ రియల్టీలోకి సెర్టస్ క్యాపిటల్ ప్రవేశించింది. సైబర్‌సిటీ బిల్డర్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో రూ.180 కోట్లు పెట్టుబడి పెట్టింది
సైబర్‌సిటీ బిల్డర్స్‌లో రూ.180 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రముఖ ఎన్‌బీఎ్‌ఫసీ సెర్టస్ క్యాపిటల్ తన కార్యకలాపాలను హైదరాబాద్ రియల్టీకీ విస్తరించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్.. హైటెక్ సిటీ సమీపంలో నిర్మించే రెసిడెన్షియల్ ప్రాజెక్టులో రూ.180 కోట్లు పెట్టుబడి పెట్టింది. హైదరాబాద్ రియల్టీలో తమకు ఇదే తొలి పెట్టుబడి అని తెలిపింది.