Share News

అమ్మకు ప్రేమతో

ABN , Publish Date - May 11 , 2025 | 03:30 AM

తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం..? నవ మాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లికి జీవితాంతం కృతజ్ఞులమై ఉండటం తప్ప. పిల్లల్ని పెద్ద వారిని చేసే క్రమంలో తమ జీవితాలను సైతం...

అమ్మకు ప్రేమతో

నేడు మాతృ దినోత్సవం

మాతృమూర్తికి ఆర్థిక భద్రత కల్పించండిలా

తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం..? నవ మాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లికి జీవితాంతం కృతజ్ఞులమై ఉండటం తప్ప. పిల్లల్ని పెద్ద వారిని చేసే క్రమంలో తమ జీవితాలను సైతం త్యాగం చేసిన మాతృమూర్తులందరికీ అభివందనం. ఈ రోజు మాతృ దినోత్సవం. అమ్మకు ప్రత్యేక అనుభూతిని పంచడంతో పాటు తన జీవితానికి ఆర్థిక భద్రత కల్పించే బహుమతి అందించేందుకు సరైన సందర్భమిది. అందుకు మీ ముందున్న అవకాశాలు..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

మీకు వీలైనంత సొమ్మును మీ మాతృమూర్తి పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేయండి. ఆ ఎఫ్‌డీ పత్రాన్ని ఈ ప్రత్యేక రోజున బహుమతిగా అందించండి. తద్వారా తనకు ఆర్థిక భరోసా కల్పించండి. ఒకవేళ మీ అమ్మ గారు 60 ఏళ్ల పైబడిన వారైతే, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎ్‌సఎ్‌స)లో సొమ్ము డిపాజిట్‌ చేయడం ఉత్తమం. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే సీనియర్‌ సిటిజన్‌ పథకాలపై అధిక వడ్డీతో పాటు పన్ను రాయితీ లభిస్తుంది.


పసిడి

బంగారు ఆభరణం లేదా నాణెం బహుమతిగా ఇవ్వండి. స్వర్ణాభరణం అలంకరణగా పనికొస్తుంది. ఆర్థిక అత్యవసరాల నుంచీ గట్టెక్కిస్తుంది. అంతేకాదు, ధరాఘాత ప్రభావంతో పాటు ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారం మన సంపదకు రక్షణ కల్పిస్తుంది.

సిప్‌

ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన క్రమానుగుత పెట్టుబడి పథకం (సిప్‌)లో మీ అమ్మగారి పేరిట మదుపు చేయడం ప్రారంభించండి. వారం లేదా నెలకు నిర్దిష్ఠ సొమ్మును ఆ సిప్‌ ఖాతాలో జమ చేయడం ద్వారా తన మలి జీవితానికి అవసరమయ్యే సొమ్మును సమకూర్చవచ్చు. రిటైర్మెంట్‌ ఫండ్‌ కూడా మంచి ప్రత్యామ్నాయం. జీవిత బీమా కవరేజీతో పాటు పెట్టుబడికి అవకాశం కల్పించే యూనిట్‌ లింక్డ్‌ పాలసీ (యులిప్‌) మరో మంచి ఆప్షన్‌.

ఎన్‌పీఎ్‌స

నేషనల్‌ పెన్షన్‌ పథకం (ఎన్‌పీఎస్‌)లో మీ తల్లి పేరిట మదుపు చేయడం మరో ప్రత్యామ్నాయం. ప్రభుత్వం ఆఫర్‌ చేసే ఎన్‌పీఎ్‌స పథకాలు 12 శాతం వరకు వార్షిక రిటర్నులు అందిస్తాయి. తనకు 60 ఏళ్లు వచ్చేనాటికి ఖాతాలో జమైన సొమ్ములో 60 శాతం విత్‌డ్రా చేసుకుని మిగతా నిధులను ఏటేటా వినియోగించుకోవచ్చు.

అత్యవసర నిధి

మీ అమ్మ గారి ఆర్థిక అత్యవసరాలను తీర్చేందుకు వీలుగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయండి. ఆ సొమ్మును ఇంట్లో దాచి పెట్టడం కంటే తన బ్యాంక్‌ ఖాతాలో జమ చేయడం మేలు.


ఆరోగ్య బీమా

వయసుతో పాటే అనారోగ్య సమస్యలూ పెరుగుతాయి. ఈ రోజుల్లో కార్పొరేట్‌ వైద్యం చాలా ఖరీదైపోయింది. కాబట్టి, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం ద్వారా మీ అమ్మగారికి ఆరోగ్య భద్రత కల్పించవచ్చు.

బిజినెస్‌ ఫండింగ్‌

ఒకవేళ మీ అమ్మ గారు ఏదైనా వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లయితే, మీ వంతు ఆర్థిక సాయం ద్వారా తనను సంతోషపరచండి.

ఇవి కూడా చదవండి:

Read More Business News and Latest Telugu News

Updated Date - May 11 , 2025 | 03:30 AM