Share News

హైదరాబాద్‌లో మరో నాలుగు ప్రాజెక్టులు

ABN , Publish Date - Mar 06 , 2025 | 04:09 AM

చెన్నై కేంద్రంగా పనిచేసే ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ‘కాసాగ్రాండ్‌’ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది....

హైదరాబాద్‌లో మరో నాలుగు ప్రాజెక్టులు

వైజాగ్‌, అమరావతికీ కాసాగ్రాండ్‌ విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చెన్నై కేంద్రంగా పనిచేసే ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ‘కాసాగ్రాండ్‌’ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొంపల్లి, అత్తాపూర్‌, గౌడవల్లి, మంఖల్‌ వద్ద రూ.2,500 కోట్ల పెట్టుబడితో నాలుగు ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు ప్రారంభించింది. ఇందులో రెండు విల్లా ప్రాజెక్టులు, రెండు హైరైజ్‌ కమ్యూనిటీ టవర్లని కంపెనీ ఎండీ అరుణ్‌ చెప్పారు. మూడు, నాలుగు బెడ్‌ రూమ్స్‌ తో నిర్మించే ఈ నాలుగు ప్రాజెక్టులను ఏడాదిన్నర నుంచి మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. 2,000 నుంచి 2,800 ఎస్‌ఎ్‌ఫటీ ఉండే ట్రిపుల్‌, ఫోర్‌ బెడ్‌రూమ్స్‌ ఫ్లాట్ల కనీస ధర రూ.1.4 కోట్లు, 450 గజాల్లో 4000 ఎస్‌ఎ్‌ఫటీలో నిర్మించే విల్లాల ధర రూ.4.2 కోట్లు ఉంటుందని చెప్పారు.


ఏపీపైనా దృష్టి: కాసాగ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్‌కి విస్తరించేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇందుకోసం వైజాగ్‌, అమరావతిలో కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టు అరుణ్‌ చెప్పారు. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తు త నాలుగు ప్రాజెక్టులకు తోడు హైదరాబాద్‌లో త్వరలో మరో నాలు గు ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు ప్రారంభించే యోచన ఉందన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించే తమ ప్రాజెక్టులన్నీ ప్రీమియం మిడ్‌ సెగ్మెంట్‌లోకి వస్తాయన్నారు.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2025 | 04:09 AM