Share News

హైదరాబాద్‌లో కాసాగ్రాండ్‌ బెలైర్‌

ABN , Publish Date - May 11 , 2025 | 03:25 AM

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కాసాగ్రాండ్‌.. హైదరాబాద్‌ సమీపంలోని గౌడవెల్లిలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కాసాగ్రాండ్‌ బెలైర్‌ పేరుతో హైదరాబాద్‌ ఉత్తర భాగంలో ఈ లగ్జరీ లివింగ్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది...

హైదరాబాద్‌లో కాసాగ్రాండ్‌ బెలైర్‌

గౌడవెల్లిలో అలా్ట్ర లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కాసాగ్రాండ్‌.. హైదరాబాద్‌ సమీపంలోని గౌడవెల్లిలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కాసాగ్రాండ్‌ బెలైర్‌ పేరుతో హైదరాబాద్‌ ఉత్తర భాగంలో ఈ లగ్జరీ లివింగ్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లో కాసాగ్రాండ్‌కు ఇది ఐదో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌. బెలైర్‌ ప్రాజెక్ట్‌ కోసం టాలీవుడ్‌ నటి సమంతా రూత్‌ ప్రభును ప్రచారకర్తగా నియమించుకుంది. మొత్తం 9.35 ఎకరాల విస్తీర్ణంలో 79 అలా్ట్ర లగ్జరీ 5 బీహెచ్‌కే బంగ్లాలను నిర్మిస్తోంది. ప్రతి బంగ్లాలో ప్రైవేట్‌ హోమ్‌ థియేటర్‌, ప్రైవేట్‌ లిఫ్ట్స్‌ సహా 85కి పైగా ప్రపంచ స్థాయి జీవనశైలి సదుపాయాలను పొందుపరుస్తున్నట్లు కాసాగ్రాండ్‌ వెల్లడించింది.

ప్రతి బంగళా చుట్టూ 1,000 చదరపు అడుగుల్లో ప్రైవేట్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 30 నెలల్లో ఈ బంగళాలను కస్టమర్లకు అందించనున్నట్లు కాసాగ్రాండ్‌ తెలిపింది. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్‌ 5 నుంచి కేవలం ఐదు నిమిషాల దూరంలో ఈ బెలైర్‌ ప్రాజెక్ట్‌ ఉంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఐటీ హబ్‌ సహా కామారెడ్డి, మేడ్చల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు మంచి కనెక్టివిటీని ఈ ప్రాజెక్ట్‌ కలిగి ఉందని కాసాగ్రాండ్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Read More Business News and Latest Telugu News

Updated Date - May 11 , 2025 | 03:25 AM