వారసుడిని ప్రకటించిన బఫెట్
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:36 AM
ప్రపంచ ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ తన కుమారుడు హోవర్డ్ బఫెట్‌ను వారసుడిగా ఎంచుకున్నారు. లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే బెర్క్‌షైర్ హాత్‌వేకు భవిష్యత్ చైర్మన్‌గా...

న్యూయార్క్: ప్రపంచ ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ తన కుమారుడు హోవర్డ్ బఫెట్‌ను వారసుడిగా ఎంచుకున్నారు. లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే బెర్క్‌షైర్ హాత్‌వేకు భవిష్యత్ చైర్మన్‌గా వ్యవహరించబోయేదీ హోవర్డేనని వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారెన్ బఫెట్ వయసు 94 ఏళ్లు. ఆయనకు ముగ్గురు సంతానం. ఒక కూతురు, ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడైన హోవర్డ్ బఫెట్‌కు ప్రస్తుతం 70 ఏళ్లు. బెర్క్‌షైర్ హాత్‌వే బోర్డులో 30 ఏళ్లుగా డైరెక్టర్‌గా ఉన్నారు.