Share News

బీఎ్‌సఎన్‌ఎల్‌ 4జీ కోసం అదనంగా రూ.6,000 కోట్లు!

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:46 AM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎ్‌సఎన్‌ఎల్‌)కు అదనంగా రూ.6,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది...

బీఎ్‌సఎన్‌ఎల్‌ 4జీ కోసం అదనంగా రూ.6,000 కోట్లు!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎ్‌సఎన్‌ఎల్‌)కు అదనంగా రూ.6,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఎ్‌సఎన్‌ఎల్‌ తన 4జీ కార్యకలాపాల విస్తరణ కోసం ఈ మొత్తం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గా లు వెల్లడించాయి. గత శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ భేటీలో ఈ అంశం ప్రధాన అజెండాగా ఉందని, అయితే ఇది అధికారికంగా వెల్లడించలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా లక్ష 4జీ సైట్స్‌ను ఏర్పాటు చేసేందుకు బీఎ్‌సఎన్‌ఎల్‌ ఈ నిధులను వినియోగించాలని భావిస్తోంది. కాగా రూ.19,000 కోట్లతో బీఎ్‌సఎన్‌ఎల్‌ 4జీ సేవల ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటికే ఇందులో రూ.13,000 కోట్లు ఖర్చు చేసింది.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 05:46 AM