Share News

17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:48 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎ్‌సఎన్‌ఎల్‌ రూ.262 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. బీఎ్‌సఎన్‌ఎల్‌ లాభాల్లోకి

17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎ్‌సఎన్‌ఎల్‌ రూ.262 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. బీఎ్‌సఎన్‌ఎల్‌ లాభాల్లోకి మళ్లడం దాదాపు 17 ఏళ్లలో ఇదే తొలిసారని, కంపెనీకిది కీలక మలుపు అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. బీఎ్‌సఎన్‌ఎల్‌ పలు అంశాల్లో తన పనితీరును మెరుగుపరుచుకుందన్నారు. మొబిలిటీ, ఎఫ్‌టీటీహెచ్‌, లీజ్డ్‌ లైన్‌ సేవల్లో 14-18 శాతం వృద్ధి కనబరిచిందని, జూన్‌ నాటికి 8.4 కోట్లుగా ఉన్న కస్టమర్లను సైతం డిసెంబరు చివరినాటికి 9 కోట్లకు పెంచుకోగలిగిందన్నారు. చివరిసారిగా 2007లో లాభాలను నమోదు చేసుకున్న కంపెనీ.. ఆ తర్వాత వరుస నష్టాలు, ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ వచ్చింది.

Updated Date - Feb 15 , 2025 | 05:48 AM